తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఎమ్4ప్రతినిధి ముధోల్

తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ కొట్టే శేఖర్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశం భైంసా గురుకృపా కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారాలని సిఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ను గుర్తించటానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీల అమలు పై స్పష్ట మైన ప్రకటన చేయాలని అన్నారు. ఉద్యమ కళాజారులకి సాంస్కృతిక సారధి లో 1000 ఉద్యోగాలు కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్లలో 10 శాతం వాటా ఉద్యమ కారులకి, ఉద్యమ కళాకారులకి కేటాయించాలన్నారు. అమర వీరుల కుటుంబాల అన్నింటిని ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమ కళాకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధ కళా కారుల కి పెన్షన్ సౌకర్యం కల్పించి ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర సాధకులు గా గుర్తించి గౌరవించాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ పండిత్ రావు పటేల్ , జిల్లా నాయకులు చాకేటి లస్మన్న, లోకేశ్వరం ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కుంటల ఉపాధ్యక్షులు దిగంబర్ పాల్గోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment