ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ జిల్లా : అక్టోబర్ 27
సారంగాపూర్: మండల కేంద్రనికి చెందిన కౌట్లా గారి నారాయణ రెడ్డి అనే ఆదర్శ రైతు సాగు చేసిన నూజివీడు సీడ్స్ వారి ఆధ్య- 1134 అనే ప్రత్తి రకం పై క్షేత్ర ప్రదర్శన ఆదివారం నిర్వహించారు.ఆధ్య అనే ప్రత్తి వంగడం అధిక మొక్కల సాంద్రత పద్ధతిలో సాగుచేసుకోవడం ద్వారా అధిక దిగుబడులనుపొందవచ్చు. ఈ వంగడం బెట్ట మరియు అధిక వర్షపాతం ను తట్టుకుంటుంది, ఎక్కువ సంఖ్యలో ఆకులు ఉండటం వల్ల అధిక వర్షాలు తట్టుకొనే శక్తిని కలిగి ఉంటుంది . ఈ రకమైన ప్రత్తి వంగడం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది అలాగే గులాబీ రంగు పురుగు ఉదృతి నుండి తప్పించుకుని తక్కువ పంట కాలం కలిగి తొందరగా పత్తి కోతకు వచ్చి రెండవ పంటకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడి అందిస్తుంది అని అలాగే పత్తి తొందరగా కోతకు రావడం వల్ల రెండవ పంట మొక్కజొన్న నూజివీడు విన్నర్ -8352. వేస్కోవచ్చని డి ఆర్ ఏం రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమం లో చుట్టు పక్కన 10గ్రామాల రైతులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో నూజివీడు సిబ్బంది స్థానిక డిస్ట్రిబ్యూటర్స్ జి.సచిన్, కిష్టయ్య , కౌట్ల(బి) మ్యాక్ట్ ప్రెసిడెంట్ నాకిరెడ్డి నర్సారెడ్డి, ఎల్ .వినోద్. ఎస్ఓ సాయినాథ్ , ఏండిఓ ప్రశాంత్ వివిధ గ్రామాల 200 రైతులతో పాటు స్థానిక డీలర్లు పాల్గొన్నారు