- బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి
- గుజరాత్ సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూ ఘాట్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటు
- HYDలో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్’లో సీఎం రేవంత్ ప్రసంగం
CM రేవంత్ రెడ్డి గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని తెలిపారు. HYDలో ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో పాల్గొని, బాపూ ఘాట్‌ను విశ్వవేదికగా నిలబెట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను మరింతగా చాటిచెప్పాలని అన్నారు.
హైదరాబాద్‌లోని బాపూ ఘాట్‌ను గాంధీ సిద్ధాంతాల ప్రాముఖ్యతను ప్రతిపాదించే విధంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్ వేదికగా ఏబీపీ నెట్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఈసా, మూసీ నదులు కలిసే ప్రాంతంలో ఉన్న బాపూ ఘాట్ వద్ద గుజరాత్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగా గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
CM రేవంత్, బాపూ ఘాట్‌ను గాంధీ సిద్ధాంతాల కేంద్రముగా తీర్చిదిద్దడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందేలా చేయాలని పేర్కొన్నారు. గాంధీజీని ప్రేరణగా తీసుకుని, సామరస్యాన్ని పెంపొందించేలా ఈ ప్రాజెక్టు తీసుకుంటున్నామని తెలిపారు.