గురుకృపాలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన

బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ స్నేహ రెడ్డి
  • జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలలో భాగంగా కార్యక్రమం.
  • ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్నేహ రెడ్డి పాల్గొన్నారు.
  • స్వయంక్షణి పరీక్షల ప్రాముఖ్యతను చాటిన డాక్టర్.

భైంసా, అక్టోబర్ 25:

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భైంసా పట్టణానికి చెందిన ప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ స్నేహ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 35 సంవత్సరాల వయస్సు పైబడిన స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశముందని చెప్పారు. ఈ క్రమంలో, కుటుంబ వైద్యుని నుంచి స్వయం పరీక్ష విధానాన్ని తెలుసుకొని, స్వతహాగా తన శరీరాన్ని పరిక్షించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల డైరెక్టర్ ముష్కం ప్రసన్న రాణి, ముష్కం తన్విశ్రీ, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

క్యాన్సర్ నివారణలో ఆరోగ్యకరమైన జీవనశైలి, రోజుకు వ్యాయామం మరియు పౌష్టికాహారం తీసుకోవడం అత్యంత ముఖ్యమని డాక్టర్ స్నేహ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తరించాలనీ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment