ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Alt Name: Mudhol Police Martyrs Day Event
  • ముధోల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవ వేడుకలు.
  • సిఐ జి. మల్లేష్ సమాజం శాంతియుతంగా ఉండేందుకు పోలీసు సేవలు కీలకమని అన్నారు.
  • విద్యార్థులకు పోలీసు విధులు, ఆయుధాల పై అవగాహన.

Alt Name: Mudhol Police Martyrs Day Event

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. సిఐ జి. మల్లేష్ సమాజం శాంతియుతంగా ఉండేందుకు పోలీసు సేవలు ముఖ్యమని అన్నారు. విద్యార్థులకు పోలీసు విధులు, ఎఫ్ఐఆర్ నమోదు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత గురించి అవగాహన కల్పించారు.

: M4 న్యూస్, (ప్రతినిధి), ముధోల్:

ముధోల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిఐ జి. మల్లేష్ మాట్లాడుతూ, సమాజం శాంతియుతంగా కొనసాగాలంటే పోలీసు విధి నిర్వహణ కీలకమని, పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సమాజ సేవ చేయాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరిగే పోలీసు అమరవీరుల దినోత్సవం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకునే సందర్భంగా అన్నారు.

విద్యార్థులకు పోలీసు విధులు, ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలపై క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయి కిరణ్, ఏఎస్సైలు లస్మ రెడ్డి, సాయబ్ రావు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment