వలస నేతలకు డైరెక్టర్ పదవులు ఇవ్వడం ఏంటి?
తఢాఖా చూపిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పటేల్ వర్గీయులు
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 24
భైంసా మార్కెట్ కమిటి వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులు వలస పక్షులకు ఇవ్వడం ఏంటని, అసెంబ్లీ ఎన్నికల్లో, పని చేసిన తమ సంగతి ఏంటని మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పటేల్ వర్గీయులు గుర్రుగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.. అధికార పార్టి లో పది సంవత్సరాల ఉండి, అధికారం పోగానే పార్టి లో చేరి కష్ట కాలం లో పని చేసిన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేశారని స్థానిక సంస్థ ల ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.. ఈ విషయమై అధిష్టానం వద్ద తాడో పేడో తేల్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తీరు పట్ల గుర్రుగా ఉన్నట్లు చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.. పార్టీ కష్టాల్లో ఉన్న సమయం లో తాము రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తే, వారంతా బి. ఆర్. ఎస్. లో ఉండి ఇప్పుడు పదవులు పొందడం ఏంటని మండి పడుతున్నారు..డైరెక్టర్ పదవులు ఒకే వర్గానికి కట్ట బెట్టడం తో కాంగ్రెస్ లో వర్గ పోరు మరింత ముదురుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ ఆగుపడుతుంది