- ఉచిత ఇసుక విధానానికి సవరణ చర్చ
- దీపం పథకం కింద ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ
- దేవాలయాల పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంపు ప్రతిపాదన
- కొత్త రేషన్ కార్డుల జారీ, వాలంటీర్ల కొనసాగింపు చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అమరావతిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉచిత ఇసుక విధానం, ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రేషన్ కార్డుల జారీ, వాలంటీర్ల నియామకం, దేవాలయాల పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంపు వంటి ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టులపై ప్రభుత్వం చర్చించనుంది.
అమరావతి: అక్టోబర్ 23
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం అమరావతిలో ఈ రోజు ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం అనేక ప్రతిపాదనలను చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.
సమావేశంలో ఇసుక సీనరేజ్ రద్దుకు సంబంధించిన సవరణ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా ‘దీపం’ పథకం కింద ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీని అమలు చేయడం, దేవాలయాల పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య 15 నుంచి 17 మందికి పెంచే చట్ట సవరణ ప్రతిపాదన చర్చించబడుతోంది.
ఇతర అంశాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ, వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం వంటి అంశాలు ప్రధాన చర్చకు వస్తాయి. అంతేకాదు, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టుల ప్రగతిపై, పోలవరం పనుల ప్రారంభంపై కేబినెట్ లో సమీక్ష జరగనుంది.