M4 న్యూస్, నిర్మల్, అక్టోబర్ 23, 2024
నిర్మల్ జిల్లా బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు అప్క గజేందర్ యాదవ్ మాట్లాడుతూ, ఈ నెల 28న ఆదిలాబాద్లో బీసీ కమిషన్ ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీసీ కులాల సమస్యలను వినిపించడానికి అందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలపై సమగ్ర కులగణన సర్వే కోసం బీసీ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ బృందం ఈ నెల 28న ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో బీసీ కులాల విజ్ఞాపనలను స్వీకరించనుంది. ఈ సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ నాయకులు, కుల సంఘ నాయకులు, వివిధ పార్టీల నాయకులు హాజరై తమ సమస్యలను కమిషన్కు తెలియజేయాలని యాదవ్ పిలుపునిచ్చారు.