M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22
- జీహెచ్ఎంసీ ఆదాయంలో రూ.300 కోట్లు తగ్గుదల
- భవన నిర్మాణాల తగ్గుదల కారణంగా ఆదాయం స్రవించటం
- 2023-24తో పోలిస్తే 2024-25లో 350 కోట్ల నష్టమే
హైదరాబాద్ నగరంలో నిర్మాణ అనుమతుల ఆదాయం 2023-24తో పోలిస్తే దారుణంగా పడిపోయింది. బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం తగ్గడంతో, జీహెచ్ఎంసీ ఆదాయం గణనీయంగా తగ్గింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతుల ఆదాయం, గత ఏడాదితో పోలిస్తే ఏకంగా రూ.300 కోట్ల మేర తగ్గింది. గత మూడు, నాలుగు సంవత్సరాలతో పోలిస్తే, నిర్మాణ అనుమతులు మరియు నివాసయోగ్య పత్రాల జారీ రుసుములో దారుణమైన తగ్గుదల ఏర్పడింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీకి రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా, 2024-25లో ఇప్పటి వరకు కేవలం రూ.450 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఈ ఏడాది అందుతున్న భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు గణనీయంగా తగ్గడం, నిర్మాణ అనుమతుల జారీ రుసుము పట్టణ ప్రణాళికా విభాగానికి ప్రధాన ఆదాయ వనరు కావడం వల్ల ఈ స్థితి ఏర్పడింది.