కామన్ పల్లి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గ్రామ కమిటీ ఎన్నిక

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం

మాల-నేతకాని ఉప కులాల సమావేశం జనుగురూ లచ్చన్న మునిగేల శ్రీనివాస్ అధ్యక్షతన కామన్ పల్లి గ్రామ పంచాయతీలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ పాల్గొన్నారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్‌లను తొలగించడానికి బిజెపి, వారి అనుబంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉద్యోగాల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది” అని తెలిపారు.

తీర్పుల పై వ్యాఖ్యలు: “సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రివ్వు పిటిషన్ లు వేస్తే కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తిరస్కరించడం చాలా దుర్మార్గం. వర్గీకరణ అంశం పై కోర్టులకు అధికారం లేదు, ఇది చట్ట సభలకు మాత్రమే సంబంధించిన అంశం” అని అన్నారు.

బిజెపి, టీడీపీ, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల పై విమర్శలు: “బిజెపి, నరేంద్ర మోడి, టీడీపీ, చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సహా, వీరు కలిసి ఉన్న కులాలను విడగొట్టి తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో జన్నారం మండల మాజి ఎంపిపి మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ల రమేష్, రాష్ట్ర నాయకులు జక్కుల సురేష్, బొట్ల సంజీవ్, మరియు కుల పెద్దలు పాల్గొన్నారు.

గ్రామ కమిటీ ఎన్నికలు: సమావేశానంతరం, కామన్ పల్లి గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు.

  • అధ్యక్షులు: జునుగురు వెంకటేష్
  • ప్రధాన కార్యదర్శి: మునిగెల భాస్కర్
  • ఉపాధ్యక్షులు: తోకల ఎల్లయ్య
  • కోశాధికారి: జునుగురు లచ్చన్న
  • ప్రచార కార్యదర్శి: జునుగురు గణేష్
  • సహాయ కార్యదర్శి: దుర్గం సాయన్న
  • గౌరవ సలహాదారులు: మునిగేలా కాంతారావు, మునిగేలా శ్రీనివాస్
  • కార్యవర్గ సభ్యులు: మల్కళ్ళ లచ్చన్న, తోకల గంగరాజం, తోకల భీమయ్య, జునుగురు చంద్రశేఖర్, కామేరా లచ్చన్న, జాడి రాజశేఖర్, కామేరా రజాలింగు, కామేరా రజన్న.

Leave a Comment