ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 21
ప్రభుత్వ సొయాకొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి 6 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని పరిమితి ఉంచడం తో 6క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల కు కొనుగోలు పరిమితిని పెంచాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ కు వినతి పత్రం అందించగా, ప్రభుత్వం పది క్వింటాళ్ల కు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది.. దీంతో రైతుల సమస్య తీర్చినందుకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు