అమరావతి, అక్టోబర్ 21:
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శిస్తారు. నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్‌ఎస్‌ఆర్ పేటలో రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించనున్నారు.
అనంతరం, గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను సందర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. గుర్ల గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు, పారిశుద్ధ్య పరిస్థితులు, తాగునీటి సరఫరా తదితర అంశాలను తనిఖీ చేయనున్నారు. పర్యటన ముగింపులో, విజయనగరం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.