- బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ గారు చేసిన అభిప్రాయం.
- రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశం వివరాలు.
- సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తల పాత్ర.
భారతీయ జనతా పార్టీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, మాజీ మంత్రి లాల్ సింగ్, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎస్సీ మోర్చా క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. ప్రతి మండలంలో 5-10 క్రియాశీల సభ్యత్వం నమోదు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎస్సీ అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిర్మల్: అక్టోబర్ 20 –
భారతీయ జనతా పార్టీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, మాజీ మంత్రి లాల్ సింగ్, తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైనప్పుడు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మరియు బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సమావేశంలో వాల్మీకి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం, అనంతరం ఎస్సీ మోర్చా రాష్ట్ర పధికారులు మరియు జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎస్సీ మోర్చా కీలకమైన పాత్ర పోషించాలన్నారు.
కార్యకర్తల నుంచి ప్రతి మండలంలో 5-10 క్రియాశీల సభ్యత్వం నమోదు చేయాలని కోరారు. ప్రతి క్రియాశీల కార్యకర్త 100 మందిని ఎస్సీ బూతుల్లో చేర్చాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ఎస్సీ అభ్యర్థులు గెలవాలనే లక్ష్యంతో పనిచేయాలని లాల్ సింగ్ సూచించారు.