కుమ్రం భీం ఆశయ సాధన కోసం కృషి చేద్దాం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

: కుమ్రం భీం విగ్రహ ఆవిష్కరణ 2024

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
ఉట్నూర్: అక్టోబర్ 19

: కుమ్రం భీం విగ్రహ ఆవిష్కరణ 2024

కుమ్రం భీం హక్కుల సాధనకై చేసిన పోరాటం స్ఫూర్తి దాయకమని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శనివారం తాటిగూడ గ్రామంలో కుమ్రం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

: కుమ్రం భీం విగ్రహ ఆవిష్కరణ 2024

ఆదివాసుల హక్కులకై “జల్ జంగల్ జమీన్” నినాదంతో కుమ్రం భీం చేసిన పోరాటం గొప్పదని ఆయన తెలిపారు. “ఆ మహనీయుడు స్ఫూర్తితోనే నేను అనేక ఉద్యమాల్లో పాల్గొని నేడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాను” అని చెప్పారు.

: కుమ్రం భీం విగ్రహ ఆవిష్కరణ 2024

నేటి యువత కుమ్రం భీం ఆశయాల సాధన కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. “ఆ మహనీయుడి బాటలో నడుస్తూ ఆయన కలలు కన్న సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని” పిలుపునిచ్చారు.

: కుమ్రం భీం విగ్రహ ఆవిష్కరణ 2024

అనంతరం, వేణునగర్ కాలానిలో కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో:
మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమ్రం భీం మనువడు సోనేరావ్, జిల్లా సార్మేడి, గ్రామ పటేల్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment