M4 న్యూస్ (ప్రతినిధి)
ఉట్నూర్: అక్టోబర్ 19
కుమ్రం భీం పోరాట స్ఫూర్తితో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. శనివారం కల్లూరు గూడ గ్రామంలో భీం వర్ధంతి సందర్భంగా జెండా ఆవిష్కరించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కుమ్రం భీం చేసిన జల్ జంగల్ జమీన్ పోరాటం తనకు స్ఫూర్తినిచ్చింది,” అని పేర్కొన్నారు.
అంతేకాక, ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 8 కోట్లతో రోడ్డు పనులు మంజూరు చేయించానని, త్వరలో మరింత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.