ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 19
తనకు ఏ జాతి వ్యతిరేకం కాదని, దేశద్రోహులే నా శత్రువులని సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ధ్యేయంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం బైంసా పట్టణంలోని లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపంలో పట్టణ, మండలనికి చెందిన 297 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు పథకాలు అందించడంలో తీవ్ర జాప్యం చేసిందని, తాను ఎన్నికయ్యాక పది నెలల కాలంలో 2500 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించడం జరిగిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే తన ధ్యేయమని పేద ప్రజానీకానికి అన్నవేళల అండగా ఉంటాన న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల తో పాటు తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎంఐఎం పార్టీ సైతం పోరాడాలని సూచించారు. పట్టణంలో పలు సమస్యలు ఉన్నాయని మున్సిపల్ కౌన్సిలర్ లు తెలియజేయడంతో త్వరలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు తాసిల్దార్ కార్యాలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. గదులు లేక ఆఫీస్ సిబ్బంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతు ఎమ్మెల్యేగా గెలిచిన నుండి రామారావు పటేల్ విద్య, వైద్యం, సాగునీటి పై దృష్టి సారించారని అందులో భాగంగానే బైంసా ఏరియా హాస్పిటల్ కి సొంత నిధులు వెచ్చించి, అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్,మున్సిపల్ కౌన్సిలర్లు,ఎం. ఐ. ఎం నాయకులు పైజూల్లా ఖాన్, అమీర్ హైమద్, బిజెపి పట్టణ అధ్యక్షులు మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, మాజీ ఎం. పి పి. అబ్దుల్ రజాక్, సీనియర్ నాయకులు సొలంకి భీమ్ రావ్, రమేష్, నాయకులు రావుల పోశెట్టి,గౌతం పింగ్లే,పండిత్ రావ్, బిజెపి మండల అధ్యక్షులు భూమేష్, మహిళ నాయకురాలు సిరం సుష్మ రెడ్డి, మాజీ సర్పంచ్ లు ఎంపిటిసి లు తదితరులు ఉన్నారు.