ప్రయాణికులకు అవగాహన సదస్సు

అల్ట్ నేమ్: రోడ్డు భద్రత అవగాహన

M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్ : అక్టోబర్ 19

 

  • వాంకిడి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
  • ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ప్రయాణికులకు వివరాలు
  • హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి రక్షణ చర్యలపై సూచనలు

 నేరడిగొండ మండలం వాంకిడి గ్రామంలో ప్రయాణికులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది ఈ కార్యక్రమంలో హాజరై, ప్రయాణికులకు రోడ్డు భద్రత పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, అతివేగాన్ని నివారించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

 ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామంలో శనివారం రోజు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సదస్సులో వివరించారు.

డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ రాజన్న మాట్లాడుతూ, వాహనదారులు మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాల సమయంలో గాయాల తీవ్రత తగ్గుతుందన్నారు. అలాగే, వాహనాలను అధిక వేగంతో నడిపి ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తూ బాధ్యతగా నడపాలని సూచించారు.

ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమైనదని, అందుకే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించడం మేలు అని ఆయన వివరించారు. ప్రయాణికులు ఆర్టీసీ ‘గమ్యం’ యాప్ ఉపయోగించుకుంటే, తమ బస్సు ఎప్పుడెక్కడికి వస్తుందో తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో గ్రామస్థులు, విద్యార్థులు, పలు వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment