ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
మస్కట్: అక్టోబర్ 18, 2024
ACC ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో శనివారం ఇండియా-A జట్టు మరియు పాకిస్థాన్-A జట్టు మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు మస్కట్‌లోని అల్ అమెరత్ క్రికెట్ స్టేడియంలో తలపడనుండటంతో క్రికెట్ అభిమానులలో ఆసక్తి పెరిగింది. భారత జట్టుకు యువ కెప్టెన్ తిలక్ వర్మ నాయకత్వం వహించనున్నాడు.
ఇరు జట్లకు ఇది టోర్నీలో తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ అభిమానులకు మరపురాని క్షణాలను అందించనుందని భావిస్తున్నారు.