- గ్రూప్-I మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన శిక్షణ సమావేశం
- పరీక్షలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తల తీసుకోవాలని కలెక్టర్ సూచన
- 11 పరీక్ష కేంద్రాల్లో 8 వేల 08 మంది అభ్యర్థుల పరీక్ష
రంగారెడ్డి: గ్రూప్-I మెయిన్స్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయా అధికారులు పాల్గొని, పరీక్షల ఏర్పాట్లపై చర్చించారు. 21 నుంచి 27 అక్టోబర్ వరకు 11 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ చెప్పారు.
రంగారెడ్డి: గ్రూప్-I మెయిన్స్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, ఐడెంటిఫికేషన్ అధికారులు, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించే గ్రూప్-I మెయిన్స్ పరీక్షల్లో 8 వేల 08 మంది అభ్యర్థులు పాల్గొంటారని, జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్తు, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది మొబైల్ ఫోన్లు కేంద్రాలకు తీసుకురాకూడదని సూచించారు. రూట్ అధికారులు తమ నియమిత ప్రాంతాలను ముందే పర్యవేక్షించాలని, అలాగే ఐడెంటిఫికేషన్ అధికారులు హాల్ టికెట్, ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.