బీఆర్ఎస్ ఫిర్యాదు పై ఘాటుగ స్పందించిన బిజెపి నాయకులు

బిజెపి ఆర్మూర్ సమావేశం
  • బిఆర్ఎస్ ప్రతినిధులు ఆర్మూర్ ఎమ్మెల్యే పై ఫిర్యాదు
  • బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం, పత్రికా సమావేశం
  • బిఆర్ఎస్‌కు హిందువుల సమస్యలపై మాట్లాడే అర్హత లేదని బిజెపి నాయకులు పేర్కొన్నారు

 

ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి పై బిఆర్ఎస్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడాన్ని బిజెపి ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండించింది. బిజెపి జిల్లా ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా బిఆర్ఎస్ ప్రతినిధులు వ్యవహరించారని, హిందూ సమస్యలపై స్పందించని వాళ్లకు ఈ అంశంపై మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు.

 

ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి పై బిఆర్ఎస్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడాన్ని బిజెపి ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన పత్రికా సమావేశంలో బిజెపి జిల్లా ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ, బిఆర్ఎస్ నాయకుల తీరును తీవ్రంగా విమర్శించారు.

జెస్సు అనిల్ కుమార్, “ముత్యాలమ్మ గుడి నందు మత ఉన్మాది విధ్వంసం చేసినప్పుడు ఈ బిఆర్ఎస్ నాయకులు మౌనం వహించారు, కానీ ఇప్పుడు రాకేష్ రెడ్డి పై అనవసర ఆరోపణలు చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపి నాయకులు, బిఆర్ఎస్‌కి హిందువుల సమస్యలపై మాట్లాడే అర్హత లేదని, ఆర్మూర్ ఎమ్మెల్యే పై చేసిన ఫిర్యాదు వారి దురాశను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. “హిందువులపై జరిగే ఆకృత్యాలకు బిజెపి మాత్రమే స్పందించగలదని, ఆర్మూర్ ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి సహనంతో సమాధానమివ్వడం లేదని” బిజెపి నాయకులు హెచ్చరించారు.

ఈ సమావేశంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు దోండి ప్రకాష్, కార్యదర్శి మిర్యాల్కర్ కిరణ్, బీజేవైఎం అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment