ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిజామాబాద్: అక్టోబర్ 18, 2024
భారత వ్యవసాయ అనుబంధ రంగాల రక్షణ కోసం స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని ఏఐకేయంఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సదస్సులో రైతుల సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
- రైతుల సమస్యలు: వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు అప్పుల భారం, మరియు గిట్టుబాటు ధరలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- అమలు చేయాల్సిన సిఫారసులు: సబ్సిడీలు తగ్గించడం, ఎరువుల సమస్యలు, మరియు రైతు రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.