ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
తేదీ: అక్టోబర్ 18, 2024
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించింది. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో గురువారం మూసివేసిన స్వామివారి మెట్టు మార్గాన్ని నేడు (శుక్రవారం) తిరిగి తెరచినట్లు టీటీడీ తెలిపింది.
- నడకదారిన వెళ్లి భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని వెల్లడించింది.
- వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ మార్గాన్ని తిరిగి ఓపెన్ చేశారు.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గురువారం స్వామివారిని 58,637 మంది భక్తులు దర్శించుకున్నారు, మరియు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.69 కోట్లు ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు.