ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిర్మల్: అక్టోబర్ 17, 2024
జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష్, పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు.
- పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం: కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల్లో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
- ఆధికారుల సమీక్ష: మండలాల వారీగా పెండింగ్ ఉన్న జిల్లా ప్రజావాణి, సీఎం ప్రజావాణి, పౌర సేవల గుర్తింపు పత్రాలకు సంబంధించిన వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
- పకడ్బందీ పరిష్కారం: దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, రిజెక్ట్ చేసిన దరఖాస్తులకు సంబంధించి కారణాలను రిమార్కుల విభాగంలో పొందుపరచాలని తెలిపారు.
- భూ సమస్యల పరిష్కారం: వివాదాస్పద భూ సమస్యల పరిష్కారంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులను కోరారు.
- పౌర సేవల గుర్తింపు: పౌర సేవల గుర్తింపు పాత్రల జారీలో ఆలస్యం చేయకుండా చూడాలని సూచించారు.
- కళ్యాణలక్ష్మి, షాదీముభాకరక్ దరఖాస్తులు: ఈ దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించాలని ఆదేశించారు.
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలో ప్రారంభించాలని, తహసీల్దార్లు ఈ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్ఓ భుజంగ్ రావ్, సీపీఓ జీవరత్నం, మరియు అన్ని మండలాల తహశీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.