- సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం.
- జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తన తర్వాత జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేసారు.
- కేంద్రం ఆమోదం తెలిపిన పక్షంలో, జస్టిస్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ సీజేగా బాధ్యతలు చేపడతారు.
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, తన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పేరును ప్రతిపాదించారు. కేంద్రం ఆమోదించిన పక్షంలో, నవంబర్ 12న ఆయన సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు.
ప్రస్తుత సీజేఐ కేంద్ర న్యాయశాఖకు తన సిఫార్సును లేఖ రూపంలో పంపుతారు. ఆ లేఖ ప్రధానమంత్రి, రాష్ట్రపతి పరిశీలన అనంతరం ఆమోదం పొందిన తర్వాత జస్టిస్ ఖన్నా బాధ్యతలు చేపడతారు. సంప్రదాయం ప్రకారం, సీజేఐ తన తర్వాత పదవిలో అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు.