శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలు
మనోరంజని, నిర్మల్ ప్రతినిధి, డిసెంబర్ 23
నిర్మల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గల శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలను సోమవారం రోజు ఉదయం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం హారతి కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొద్దుల భానుచందర్, ఠాకూర్ రాకేష్ సింగ్, కోశాధికారి కొత్తూరు సాయినాథ్, తిరుపతి, బ్రహ్మయ్య, గురువుల భూమయ్య ,భూమేష్, రాము ,సంతోష్ ,సాయి ప్రసాద్ ,రాజు , లక్ష్మణ్ అయ్యప్ప స్వాములు, శ్రీనగర్ కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.