సిరాల ప్రాజెక్ట్ ద్వారా 600 ఎకరాలకు సాగునీరు అందిస్తాం — ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
భైంసా, డిసెంబర్ 26 (మనోరంజని తెలుగు టైమ్స్):
సిరాల ప్రాజెక్ట్ ద్వారా సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు.
శుక్రవారం సిరాల ప్రాజెక్ట్ కాలువ ద్వారా రబీ పంటకు సాగునీటి విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ —
“గతంలో భారీ వర్షాల కారణంగా కట్ట తెగిపోవడంతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వాన్ని ఒప్పించి 12 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ప్రాజెక్ట్ పునర్నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమైంది,” అని తెలిపారు.ప్రాజెక్ట్ పునరుద్ధరణకు సహకరించిన రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే కేవలం ఒక సంవత్సర కాలంలోనే పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్ బృందాన్ని కూడా ఎమ్మెల్యే అభినందించారు.
రైతాంగ సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, చెరువుల పునరుద్ధరణ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పునఃప్రారంభం వంటి పథకాల ద్వారా నియోజకవర్గంలో సాగునీరు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఇరిగేషన్ ఇ.ఇ. అనిల్ కుమార్, సిరాల, ఇలేగాం, దేగాం గ్రామాల సర్పంచులు కదం సునంద, సిరం రాజమణి శ్రీనివాస్, సిరం సుష్మరెడ్డి, చింతల్ బోరి సర్పంచ్ పండిత్ రావ్ పటేల్, మాజీ ఎంపీపీ రజాక్, సీనియర్ నాయకులు సొలంకి భీంరావ్, కాంబ్లే సుభాష్, చంద్రకాంత్ పటేల్, బాలాజీ పటేల్, వెంకట్ రావ్ పటేల్, ఉపసర్పంచులు శివాజీ, శ్రీనివాస్ తదితర గ్రామ పెద్దలు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.