ప్రజావాణికి 60 ఫిర్యాదులు

జిల్లా కలెక్టర్ ప్రజావాణి సమావేశంలో ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం.

M4 న్యూస్ తెలంగాణ బ్యూరో

 జిల్లా కలెక్టర్ ప్రజావాణి సమావేశంలో ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం.

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 28, 2024

జిల్లా కలెక్టర్ శశాంక, ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను హితవు పలుకారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 60 దరఖాస్తులు అందినట్లు, రెవెన్యూ శాఖకు 42, ఇతర శాఖలకు 18 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం ఉంది.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment