కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం దిగిన 7 మందిలో 5మంది మృతి

Kondapochamma_Reservoir_Accident
  • సెల్ఫీ దిగేందుకు కొండపోచమ్మ సాగర్లో ప్రవేశించిన ఏడుగురు
  • ఐదుగురు యువకులు మృత్యువాత, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు
  • హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన బాధితులు

సంగారెడ్డి జిల్లా కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో 7 మంది యువకులు నీటిలోకి దిగగా, 5 మంది మునిగి మృతి చెందారు. మృతులందరూ హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. మృతి చెందిన వారిలో దనుష్, లోహిత్, చీకట్ల దినేశ్వర్, సాహిల్, జతిన్ ఉన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంగారెడ్డి జిల్లా కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ దిగడానికి నీటిలోకి ప్రవేశించిన 7 మంది యువకుల్లో 5 మంది మునిగి మృత్యువాత పడ్డారు. మృతులు హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందినవారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

మృతి చెందిన యువకుల వివరాలు:

  1. దనుష్ (20 సంవత్సరాలు), ఫోటో స్టూడియో వర్కర్, ఎస్సీ మాదిగ, ముషీరాబాద్
  2. లోహిత్ (17 సంవత్సరాలు), ఎస్సీ మాదిగ, దనుష్ సోదరుడు
  3. చీకట్ల దినేశ్వర్ (17 సంవత్సరాలు), ఎస్సీ మాదిగ, కవాడిగూడ
  4. సాహిల్ (19 సంవత్సరాలు),
  5. జతిన్ (17 సంవత్సరాలు), బీసీ, డిప్లొమా విద్యార్థి, ఖైరతాబాద్

బ్రతికి బయటపడ్డవారు:

  1. కొమారి మృగాంక్ (17 సంవత్సరాలు), డిప్లొమా 2వ సంవత్సరం, రాంనగర్
  2. Md ఇబ్రహీం (20 సంవత్సరాలు)

సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన సమయంలో ఒక్కసారిగా గట్టి ప్రవాహం కారణంగా నీటిలో మునిగిపోయారని ప్రాథమిక సమాచారం. సురక్షితంగా బయటపడిన ఇద్దరు స్థానికుల సహాయంతో తేలారన్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment