రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాం గ్రామ పాఠశాలలకు సహాయ సామగ్రి పంపిణీ

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాం గ్రామ పాఠశాలలకు సహాయ సామగ్రి పంపిణీ

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాం గ్రామ పాఠశాలలకు సహాయ సామగ్రి పంపిణీ

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాం గ్రామ పాఠశాలలకు సహాయ సామగ్రి పంపిణీ

  • రోటరీ క్లబ్ అఫ్ చేంజ్ మేకర్స్ హైదరాబాద్ ఎంజీవో కార్యక్రమం

  • ఏలేటి నరసింహ రెడ్డి గారి జ్ఞాపకార్థం 1 లక్ష రూపాయల విలువైన సహాయ సామగ్రి

  • మూడు పాఠశాలలకు మైక్ సెట్‌లు, బాగ్స్, నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ అందజేత

 

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామంలోని మూడు పాఠశాలలకు రోటరీ క్లబ్ అఫ్ చేంజ్ మేకర్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణీ జరిగింది. ఏలేటి నరసింహ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన కుమార్తె లావణ్య–దేవేందర్ రెడ్డి సుమారు 1 లక్ష రూపాయల సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.

 

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్ (పెద్దూర్), ప్రైమరీ స్కూల్ (చిన్నూర్) విద్యార్థులకు రోటరీ క్లబ్ అఫ్ చేంజ్ మేకర్స్ హైదరాబాద్ ఎంజీవో ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం కీర్తిశేషులు ఏలేటి నరసింహ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఆయన కుమార్తె శ్రీమతి లావణ్య మరియు దేవేందర్ రెడ్డి  సుమారు ₹1 లక్ష విలువైన వస్తువులను అందజేశారు. పాఠశాలలకు మైక్ సెట్, కార్పెట్‌లు, నోటీసు బోర్డులు, గ్లోబ్, చెస్ బోర్డు, వాలీబాల్‌లు, ప్రపంచ పటాలు, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్, ప్లేట్స్, గ్లాస్‌లు మొదలైనవి అందజేశారు.

ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్‌మాస్టర్ జనార్దన్, ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు నర్సయ్య, విజయ్ కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షులు యోగేశ్వర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment