స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు

స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు దర్శనానికి పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు వ్యాపార- వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ బాసర మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26 దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హారతి విశేష పూజల అనంతరం అమ్మవారికి నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర- కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా వస్తున్నారు. అమ్మవారి క్షేత్రంలో ప్రవహించే పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారి దర్శనానికి పాదయాత్రగా తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా పాదయాత్రగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ పట్టణానికి చెందిన వ్యాపార- వర్తక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు వ్యాపారస్తులు మన్మథ్ స్వామి అప్ప, మహేందర్ పాండే, లక్ష్మీ కాంత్ పంపట్వార్ పంపింణి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు

దర్శనానికి పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు

వ్యాపార- వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ

బాసర మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు  స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హారతి విశేష పూజల అనంతరం అమ్మవారికి నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర- కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా వస్తున్నారు. అమ్మవారి క్షేత్రంలో ప్రవహించే పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారి దర్శనానికి పాదయాత్రగా తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా పాదయాత్రగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ పట్టణానికి చెందిన వ్యాపార- వర్తక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు వ్యాపారస్తులు మన్మథ్ స్వామి అప్ప, మహేందర్ పాండే, లక్ష్మీ కాంత్ పంపట్వార్ పంపింణి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment