42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి పిలుపు మేరకు భీమ్గల్లో వినతిపత్రం సమర్పణ
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరపున తహశీల్దార్ మహమ్మద్ షబ్బీర్ కు వినతిపత్రం అందజేత
42% బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని నాయకుల విజ్ఞప్తి
మనోరంజని తెలుగు టైమ్స్ భీంగల్ ప్రతినిధి నవంబర్ 04, 2025.
భీమ్గల్ మండలంలో మంగళవారం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు 42% బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి పిలుపు మేరకు తహశీల్దార్ మహమ్మద్ షబ్బీర్ కు వినతిపత్రం అందజేశారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం సాధించేందుకు ఉపవర్గీకరణ చేపట్టాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నట్లుగా బీసీ సబ్ ప్లాన్ నిధులను 40,000 కోట్లుగా కేటాయించి విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో CPML నాయకులు రాజేశ్వర్, రాజ్యాధికార సాధన జేఏసీ నాయకులు బాలరాజు, జగన్, నారాయణ, లింభాద్రి, మురళీ, శ్యామ్, సుధాకర్, జోసఫ్, మహేష్, బాబన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.