గణేష్ నగర్‌లో దుర్గామాతకు 25 కేజీల లడ్డు సమర్పణ
మనోరంజని ప్రతినిధి, నిర్మల్
నిర్మల్ జిల్లా భైంసా పట్టణం గణేష్ నగర్లో దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. శ్రీరామా చైతన్య యూత్ గణేష్ నగర్ తరఫున శ్రీ బాలాజీ గోపాల్ కుటుంబ సభ్యులు కలిసి 25 కేజీల లడ్డును దుర్గామాత నిర్వాహకులకు అందజేశారు.
దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు లడ్డును స్వీకరించి, దీనిని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.