తిరుమల స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ మళ్ళీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు 24 గంటల పాటు వేచి చూస్తున్నారు. అన్ని కంపార్ట్మెంట్లు దాటి శిలాతోరణం వరకు క్యూలైన్ విస్తరించింది. నిన్న ఒక్కరోజే 73,093 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,570 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.4.21 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం
Published On: July 19, 2025 10:11 am
