2025-26 కేంద్ర బడ్జెట్ హర్షనీయం – భాజపా నేత భవ నాసి వెంకట రామాంజనేయులు

2025-26 బడ్జెట్, భాజపా అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం, నిర్మలా సీతారామన్, మోదీ పాలన
  • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ పేదలకు ఉపయోగకరం
  • గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
  • గరీబ్, యూత్, అన్నదాత, నారీ వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత
  • అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై భాజపా హర్షం

 

భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ పేదలు, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని భాజపా ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు భవ నాసి వెంకట రామాంజనేయులు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమని, ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్ నాయకత్వాన్ని ప్రశంసించారు.

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ దేశాభివృద్ధికి పునాది వంటిదని భాజపా ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు భవ నాసి వెంకట రామాంజనేయులు అన్నారు. మార్కాపురంలో ఆయన మాట్లాడుతూ, ఈ బడ్జెట్ గ్రామాలు, పట్టణాలు, నగరాల అభివృద్ధిని వేగవంతం చేసేలా రూపొందించబడిందని హర్షం వ్యక్తం చేశారు.

“సబ్ కే సాథ్, సబ్ కా వికాస్” నినాదంతో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశ అభివృద్ధికి దోహదపడతాయని, ఇందులో గరీబ్, యూత్, అన్నదాత, నారీ వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ప్రశంసనీయమని చెప్పారు.

భారతదేశం అధిక వృద్ధి సాధిస్తున్న దేశంగా నిలుస్తుండటానికి బీజేపీ ప్రభుత్వ పాలన కారణమని పేర్కొన్న ఆయన, దేశాభివృద్ధికి మళ్లీ భాజపాను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment