2003-2004 పదవ తరగతి బాయ్స్ బ్యాచ్ ఆత్మీయ కలయిక
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 14,2025.
కోనసముందర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్, అమీర్ నగర్ గ్రామాలకు చెందిన పదవ తరగతి బ్యాచ్ బాయ్స్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాసమందర్ ఉన్నత పాఠశాల చదివిన 2003-2004 బ్యాచ్ బాయ్స్ మంగళవారం అమీర్ నగర్ బాల్య తాండ దగ్గర గ్రామ శివారులో కలుసుకున్నారు. ఇదివరకు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఒకసారి కలయిక జరుపుకున్నారు, ప్రస్తుతం గల్ఫ్ దేశంలో ఉన్న కొందరు దసరా పండుగ సందర్భంగా ఇండియాకి వచ్చిన దశలో తమ వాట్సాప్ గ్రూపులలో ఒకసారి కలుసుకుందాం అని తెలుపుకొని అక్టోబర్ 14 మంగళవారం ప్రోగ్రాం సెట్ చేసుకొని కలుసుకున్నారు. హైదరాబాద్, సిద్దిపేట లో ఉన్నవారు సైతం ప్రత్యేకంగా తమ క్లాస్ మెంట్ మిత్రులను కలుసుకోవడానికి వచ్చారు. ఇలా చాలా రోజుల తర్వాత కలుసుకున్న పూర్వ మిత్రులు ఎంతో ఆప్యాయంగా కలుసుకొని, తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని తమ ఆనందాన్ని వ్యక్త పరుచుకున్నారు. వంటలు చేసుకొని, పానీయాలు సేవించి ఇన్నేళ్ళ విద్యార్థి దశ బంధాన్ని, తీపి గుర్తులను నెమరేసుకొని సంతోషంగా గడుపుకున్నారు.ఉపాధ్యాయులను ఇమిటేట్ చేస్తూ, క్లాస్ లో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ హోదాల్లో, బిజినెస్, వ్యవసాయం,లలో ఉన్నా కూడా అందరూ తమ పనులను వదిలి వచ్చి కలుసుకున్నందుకు అందరూ సంతోషం వ్యక్త పరుచుకున్నారు.