- యుద్ధాలు, దాడులు, ఘర్షణలలో చిక్కుకున్న దేశాల్లో సగం మంది
- భారత్లో అత్యధికంగా పేదరికం
- శాంతి ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం : ఐక్యరాజ్య సమితి నివేదిక
ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. వీరిలో సగం మంది యుద్ధాలు, ఘర్షణలు ఎదుర్కొంటున్న దేశాల్లో వున్నారు. అత్యధిక పేదులు భారత్లో ఉంటూ, 23.4 కోట్ల మంది ఈ కష్టాన్ని అనుభవిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు శాంతి అవసరమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
: ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్నారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. వీరిలో సగం మంది యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న దేశాల్లో ఉంటున్నారని వెల్లడించింది. పోషకాహారం, నీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక అవసరాలు అందుబాటులో లేకపోవడం వల్ల పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయని నివేదికలో పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం, భారత్లో 23.4 కోట్ల మంది పేదరికంలో జీవిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా వంటి దేశాలు కూడా తీవ్ర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్నాయి. ఘర్షణలు ఉన్న ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కష్టమని, శాంతి నెలకొల్పితే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోగలమని సూచించారు.