దేశవ్యాప్తంగా 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
జాతీయ వైద్య కమిషన్ నుంచి 41 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం
న్యూఢిల్లీ, అక్టోబర్ 20 (M4News):
2024–25 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (NMC) 41 కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపింది.
దీంతో దేశంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1.37 లక్షలకు చేరుకుంది. వైద్య విద్యకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, త్వరలో మరో 5 వేల పీజీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అదనంగా, వైద్య విద్య సిలబస్లో క్లినికల్ రిసెర్చ్ అంశాన్ని చేర్చాలని NMC నిర్ణయించింది. ఈ మార్పుతో భవిష్యత్ వైద్యులు పరిశోధనలలో మరింత ప్రావీణ్యం సాధించేందుకు అవకాశం కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు.