- అమెరికా హోంలాండ్ భద్రతా శాఖ లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయులు పత్రాలు లేకుండా ఉన్నట్లు గుర్తింపు.
- వీరిలో 17,940 మంది భారత్‌కు పంపేందుకు అమెరికా ప్రభుత్వం ఉత్తర్వులు.
- తొలివిడతలో 104 మంది భారతీయులు భారత్‌కు బలవంతంగా రప్పింపు.
- హర్యానా (33), గుజరాత్ (33), పంజాబ్ (30), మహారాష్ట్ర (3), చండీఘడ్ (3) కు చెందినవారు.
- వీసా కలలు గల్లంతై, వేల కోట్ల రూపాయల అప్పుల భారంతో బాధపడుతున్న బాధిత కుటుంబాలు.
అమెరికా వెళ్లి స్థిరపడాలనే డాలర్ డ్రీమ్ ఎంతో మందికి కల్లకలానే మారుతోంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న 20,407 మంది భారతీయులను అమెరికా హోంలాండ్ భద్రతా శాఖ గుర్తించింది. వీరిలో 17,940 మంది భారతీయులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, తొలివిడతగా 104 మంది భారతీయులను బలవంతంగా భారత్‌కు పంపించేశారు. వీరిలో హర్యానా, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, చండీఘడ్ కు చెందిన వారు ఉన్నారు. అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లో వీరి కుటుంబాలు ఎమోషనల్‌గా మారిపోయాయి. 40 లక్షల రూపాయల దాకా ఖర్చు చేసి, మంచి భవిష్యత్తు కోసం పంపితే, ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.
ఈ ఘటనతో అమెరికా వీసా మోసాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టి అక్రమ మార్గాల్లో వెళ్లిన వారు ఇప్పుడు అప్పుల భారంతో కృంగిపోతున్నారు. ఇకపై విదేశాల్లో పనిచేయాలనే కలను సాకారం చేసుకునే ముందు సరైన పత్రాలు, న్యాయబద్ధమైన మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.