ప్రశాంత జీవితానికి 10 సూత్రాలు
మనిషి జీవితం
సమస్యల వలయం
పోలికలు ఈర్షలతో
చాడీలు సాకులతో
జీవితాన్ని ఆందోళన
పదంలో గడపరాదు
ఇతరుల జీవితాలలో
జరిగే సంఘటనల పట్ల
ఆసక్తి చూపరాదు
అడిగితే తప్ప సలహాలు
ఇవ్వరాదు
ఆస్తుల్లో హోదాలో
సంపాదనలో కీర్తిలో
ఇతరులతో పోల్చుకొని
మానసికంగా
కుంగిపోవద్దు
గతించిన కాలం పట్ల
ఆలోచించవద్దు
వర్ధమాన జీవితాన్ని
సౌకర్య వంతంగా
సౌలభ్యంగా
మలచుకోవాలి
ఇతరుల మనుసెరిగి .
మసులుకోవాలి
మన జీవితానికి
సంబంధంలేని విషయాలు
గురించి ఆలోచించకూడదు
ఇతరుల జీవితాలలో
తలదూర్చ రాదు
పనికొచ్చే విషయాల మీద
శ్రద్ధ ఏకాగ్రత నిలపాలి
వాస్తవ సమస్యల కన్నా
మనం ఊహించుకునే
సమస్యలతోనే ఎక్కువ
ఆందోళనకు గురౌతాం
అనుకున్న పనులు
భవిష్యత్తులో అవుతయో
లేధోఅని మథనపడకూడధు
జరుగని సంఘటనలు
తెలియని విషయాలు
ఊహించుకోవడం మానండి
మన దగ్గర లేని వాటి
గురించి ఫిర్యాదులు చేయడం
ఆపేయండి ఉన్న వాటి
విలువలను గుర్తించడం
నేర్చుకోండి మన అర్హతకు
తగ్గ అవకాశాలను
అందిపుచ్చుకోవడానికి
ప్రయత్నించాలి.
వర్ధమానంలో జీవిద్ధాం
సంతృప్తి సంతోషమే
మనకున్న మూలథనం
మానవీయతే మన
జీవనశైలి కావాలి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
సామాజిక ఆర్థిక అధ్యయన
వేదిక ఫ్రీలాన్స్ రైటర్
ఇండిపెండెంట్ జర్నలిస్టు
కరీంనగర్9440245771