✒భవిష్యత్తులో సన్యాసం తీసుకుంటాను: నటి రేణూ దేశాయ్
తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమని, భవిష్యత్తులో సన్యాసం తీసుకుంటానని నటి రేణూ దేశాయ్ తెలిపారు. “ఆద్య, అకీరా చిన్నవాళ్లే కాబట్టి కొన్నేళ్లు ఇక్కడ ఉంటాను. తర్వాత సన్యాసినిగా జీవిస్తాను,” అని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు ఇప్పుడు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో ఛాన్స్లు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం అత్తగారి పాత్రకు ఓకే చేశానని, త్వరలో ఆ సినిమా ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు