నర్సరీకి ₹2.51 లక్షల ఫీజా?

నర్సరీకి ₹2.51 లక్షల ఫీజా?

నర్సరీకి ₹2.51 లక్షల ఫీజా?

హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్ ఫీజు వివరాలు వైరల్

హైదరాబాద్:

ఒక ప్రైమరీ విద్యాసంస్థ నర్సరీ తరగతికి రూ. 2.51 లక్షలు, మొదటి, రెండో తరగతులకు రూ. 2.91 లక్షలు ఫీజు వసూలు చేస్తోందని ఓ యూజర్ అనురాధ తివారీ సోషల్ మీడియాలో వెల్లడి చేయగా, అది ఇప్పుడు ఎక్స్లో వైరల్ అయింది.

ఆమె పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, “ఏబీసీడీలు నేర్చుకోవడానికి నెలకు ₹21,000 చెల్లించాలా?” అని నిలదీసింది. పిల్లలకు ఇంత ఫీజుతో ఏమి ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు?, ఈ ఖర్చుకు స్కూల్ యాజమాన్యం ఇచ్చే సమాధానం ఏమిటి? అంటూ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సోషల్ మీడియా మీద మన్ననలు – విమర్శలు

ఈ పోస్ట్‌కు అనేక మంది తల్లిదండ్రుల నుంచి స్పందనలు వస్తున్నాయి. కొందరు ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వ చొరవ అవసరం అని అభిప్రాయపడగా, మరికొందరు ఇది అసమానతల శిఖర రూపం అని వ్యాఖ్యానిస్తున్నారు.

విద్యా వ్యాపారమవుతున్నదా?

ఈ ఘటన మరోసారి ప్రైవేట్ విద్యా వ్యవస్థలో నిరంకుశ ఫీజుల అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం ఉన్నా, ప్రభుత్వ ఆదేశాలు అమలులో లేవన్నది వాస్తవం అని విద్యా హక్కు కార్యకర్తలు చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment