శీర్షిక దీపావళి సౌరభం

శీర్షిక దీపావళి సౌరభం

శీర్షిక దీపావళి సౌరభం

విద్యుద్దీపాల కాంతులను వద్దని,
మట్టి ప్రమిదలతో ఇంటిని అలంకరిద్దాం,
అమ్మవారి కన్నుల్లో వెలుగు జ్యోతులు,
కాంతిమయంగా చూసి ఆనందిద్దాం. కాలుష్య రహిత సమాజమే లక్ష్యంగా,
మట్టి దీపాలలో జ్యోతులు వెలిగిద్దాం, పూరి గుడిసెల్లో అమావాస్య చీకట్లు మాయమై,
వెలుగు పుష్పాలతో విరాజిల్లెను ఆకాశం మనం అందించే చిన్న పైకంతో,
ప్రమిదల తయారీ కుటుంబాల ఆకలి తీర్చి,
వారి ఇంటి ముంగిట దీపాల తేజం,
ఈ భవ్య దీపావళి సౌరభం చిగురించేలా చేద్దాం
మహిళలు అబల కాదు, సబల అని చాటిన రోజు,
చెడుపై మంచి జయించిన శుభ దినం,
వెలుగు దివ్వెను ఆర్పే వడివడి గాలిని,
తట్టుకొని, దేదీప్యమానంగా వెలుగుతూ,
కష్టాలు క్షణికమని చాటే దీపావళి జరుపుకుందాం పెద్దలు, పిల్లలు, పాపలు ఒక్కచోట చేరి,
సంతోషంగా దీపాల వెలుగులో మునిగి,
జరుపుకునే ఈ దివ్య దీపావళి,
మనసును ఆనందంతో నింపే పండుగా మలచుకుందాం
ఈ దీపావళి మీ జీవితంలో చీకట్లను తొలగించి,
కొత్త ఆశల వెలుగులను నింపాలని,
బాణాసంచా లేకుండా, ప్రకృతి సౌందర్యంతో,
కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని,
మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక
*దీపావళి శుభాకాంక్షలు!*
రచన మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
చరవాణి: 9347042218

Join WhatsApp

Join Now

Leave a Comment