అక్టోబర్ 27, 2024
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో ఇటీవల జరిగిన భారీ అటవీ విపత్తు ప్రదేశాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పరిశీలించారు. ఆయన వెంట ములుగు జిల్లా అధ్యక్షులు పెట్టెం రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.సంజీవ, గోవిందరావుపేట మండల అధ్యక్షులు సన్నగుండ్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. సుమారు 600 ఎకరాల్లో 70 వేల చెట్లు వేర్లతో సహా నేలమట్టమయ్యాయి. ఈ సందర్భంగా డాక్టర్ భద్రయ్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకృతి విధ్వంసాలపై లోతైన అధ్యయనం అవసరమని సూచించారు. ములుగు జిల్లాలో అడవుల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు.