మంత్రులు 24న పలు కార్యక్రమాలకు హాజరు

మంత్రులు 24న పలు కార్యక్రమాలకు హాజరు

బైంసా–ముధోల్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు, చీరల పంపిణీ, మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ

మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా

తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు 24వ తేదీన ముధోల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారని మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

అయన వివరాలలో… అదే రోజు సాయంత్రం 4 గంటలకు భైంసా బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన, పార్డి ‘బి’ నుండి హల్దా రోడ్డుకు శంకుస్థాపన, భైంసా–మహారాష్ట్ర సరిహద్దు వరకు రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అలాగే వీరేగావ్ తండా–శివుని తండా వరకు హల్దా తండా మార్గంలో కొత్త రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భైంసా పట్టణ కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

వెలుగు మహిళా సంఘాల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 50 కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ చేస్తారు. దీంతో పాటు రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను అందజేయనున్నారు.

ఈ కార్యక్రమాలకు ప్రాంతీయ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విఠల్ రెడ్డి పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment