బాసర నుండి మాహుర్ జాతీయ రహదారి అనుసంధానానికి రూట్ మ్యాప్ సిద్ధం

బాసర నుండి మాహుర్ జాతీయ రహదారి అనుసంధానానికి రూట్ మ్యాప్ సిద్ధం

బాసర నుండి మాహుర్ జాతీయ రహదారి అనుసంధానానికి రూట్ మ్యాప్ సిద్ధం

ప్రభుత్వానికి నివేదించిన అధికారులు

రూట్ మ్యాప్ తో జాతీయ రహదారి అనుసంధానా నికి తొలి అడుగు

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి అక్టోబర్ 20 

బాసర జ్ఞానసరస్వతి అమ్మ వారి క్షేత్రం నుండి (మహోర్) రేణుక మాత మందిరం వరకు రెండు జాతీయ రహదారుల అనుసంధానానికి రూట్ మ్యాప్ సిద్దమైంది.ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ జాతీయ రహదారులను అనుసంధానం చేస్తే ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుందని అసెంబ్లీ లో ప్రస్తావించడం తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ని కలిసిన విషయం తెలిసిందే దీంతో కేంద్ర ప్రభుత్వం సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తో రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.NH-161BB భైంసా నుండి కుభీర్ NH -161A హిమయత్ నగర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. రెండు రహదారుల అనుసంధానం తో టూరిజం అభివృద్ధి చెందుతుంది. భక్తులు రెండు ప్రాంతాలను సందర్శించవచ్చు.రూట్ మ్యాప్ సిద్ధం చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment