దమ్మాయిగూడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ , నూతన కమిటీ అధ్యక్షుడుగా బంగారు నర్సింగరావు ఎన్నిక

దమ్మాయిగూడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ , నూతన కమిటీ అధ్యక్షుడుగా బంగారు నర్సింగరావు ఎన్నిక

మనోరంజని ప్రతినిధి కీసర జులై 30 – కీసర మండల పరిధిలో దమ్మైగూడ మున్సిపాలిటీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశం జరిపి మొదటి మహాసభను నిర్వహించడం జరిగిందని సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ నాయకులు బంగారు నర్సింగరావు తెలియజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రజాతంత్ర ఉద్యమ నాయకురాలు కామ్రేడ్ వినోద ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం ఆందోళన పోరాటాలను నిర్వహిస్తుందన్నారు. సిఐటియును పలోపేతం చేయాలన్నారు. అనంతరం సిఐటియు కీసర మండల నాయకులు చింతకింది అశోక్ మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలనీ, కార్మిక హక్కులను కాపాడాలి. చట్టాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. అనంతరం దమ్మైగూడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షులుగా: బంగారు నర్సింగరావు, ఉపాధ్యక్షులు: డప్పు కృష్ణ , చెన్నూరు కృష్ణ , ముక్కెర కృష్ణ, ప్రధాన కార్యదర్శి: గడ్డం వెంకటేష్., సహాయకార్యదర్శులు: కే. అశ్విని, కే.లావణ్య, ఎం.రాజేశ్వరి. సంయుక్త కార్యదర్శులుగా: ఎడ్ల. రాములు, బి.వెంకటేష్, ఎం. యాదమ్మ, డి.మాతమ్మ ,జి. లక్ష్మి, వీరేష్, కోశాధికారిగా: మోత్కుపల్లి రాములమ్మ. కమిటీ సభ్యులుగా: ఎన్.సుధాకర్,ఎం.యాదగిరి, కే.రాజు, బి.సుధాకర్, జి.నర్సింగరావు, ప్రకాష్, దేవేందర్, మల్లేష్, రాణి, ప్రభాకర్, నాగరాజు, పరశురాం, శశిరేఖ, భారతి, శ్యామల తదితరులను ఏకగ్రీవంగా ఎన్ని కోవడం జరిగింది. ఎన్నికైన నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం సీఐటీయూ కృషి చేస్తుందనన్నారు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) నిర్వహించే ఆందోళన, పోరాటంలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. డిమాండ్స్: 1).రెండవ పిఆర్సి ప్రకారం మున్సిపల్ వర్కర్స్ కు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలి. 2). నైపుణ్యం కలిగిన ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు 36వేల రూపాయల జీతం ఇవ్వాలి. 3).మున్సిపల్ వర్కర్స్ అందర్నీ పర్మినెంట్ చేయాలి. 4).కార్మికులందరికీ వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలి. 5).జాతీయ పండుగ సెలవులు అమలు చేయాలి. 6).కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. 7).కార్మికులందరికీ 25 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. 8).చనిపోయిన కార్మిక కుటుంబానికి దహనసంస్కరానికి 30000 రూపాయలు ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment