డీజేఎఫ్ నిజామాబాద్-కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా మాల్వేకర్ ధర్మేంద్ర
ఐదవ రాష్ట్ర మహాసభ నిర్వహణలో భాగంగా నియామకం
డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (డీజేఎఫ్) ఐదవ రాష్ట్ర మహాసభను అగస్టు 10న పెద్దపల్లిలో నిర్వహించనున్న నేపథ్యంలో, జిల్లాల వారీగా ఇన్‌చార్జీలను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిజామాబాద్-కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జిగా మాల్వేకర్ ధర్మేంద్రను నియమిస్తూ డీజేఎఫ్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకం డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తంగాల పెళ్లి అరుణ్ కుమార్ గార్ల సూచనలతో జరిగింది.
ఈ సందర్భంగా మాల్వేకర్ ధర్మేంద్ర మాట్లాడుతూ:
“ఈ బాధ్యత నాకు వచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సభ్యులందరినీ ఏకతాటిపైకి తేవడమే నా ప్రధాన కర్తవ్యం. డీజేఎఫ్ ఐదవ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడిపైనా ఉంది. మహాసభకు ప్రతి సభ్యుడు తప్పకుండా హాజరై, సమాఖ్య బలోపేతానికి తోడ్పడాలి.”