రాజమండ్రి ..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రక్షాళణ జరగాల్సిందే ..
నేటి ఆంధ్ర పాలకులతో ఆకలి – అప్పులు వెంటాడుతున్నాయి .
ఆంధ్రప్రదేశ్ కు నిధులు వరద అంటు కార్పొరేట్ కధనాలు.
ఆంధ్రులను బిక్షగాళ్ల గానే ఉంచటం కార్పొరేట్ రాజకీయ కుట్ర .
మేడా శ్రీనివాస్ , ఆవేదన,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..
మోడీ పాలన – చంద్రబాబు కూటమి తో ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్ లేదని ఆంధ్రులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్త పరిచారు..
ఆంధ్ర రాష్ట్రంలో విప్లవాత్మక చైతన్యంతో మహోన్నతమైన రాజకీయ ప్రక్షాళన జరగాలి . లేకుంటే కార్పొరేట్ రాజకీయ పాలకుల దోపిడి, అఘాయిత్యాలతోనే మన రాష్ట్రం నిత్యం ఆకలి , దారిద్రర్యంతో జీవితాలు తెల్లారిపోతున్నాయని గమనించాలి . గత 30 ఏళ్ల పై భడి దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేసిన పాలకులును , రాజకీయ పార్టీని ఆంధ్రులు చూడలేకపోయారని , ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో నాటి , నేటి పాలకులు అందరూ హైదరాబాద్ రాజాకార్ ల వారసులను తలపించే పాలనతో రాక్షస క్రూర పాలనను సాగిస్తున్నారు . ఆంధ్రుల సంపదను ఆంధ్రులకే అర కోర పంచుతూ గొప్ప పాలకుల వలే కీర్తింప బడుతుండటం ఆంధ్రుల దురదృష్టం కాదా ! మేధావుల సంపదగా పేరు గాంచిన ఆంధ్రప్రదేశ్ లో నేడు మేతావులు సంచరించటమే అందుకు కారణం . కనీస వసతులు , మౌలిక సదుపాయాలను సైతం ప్రజలకు చేరువ చేయలేని దద్దమ్మలు , అసమర్డులు నేడు పాలకులుగా చెలామణి అవుతూ కిరాయి చరిత్రకు మూల పురుషులుగా నిలుస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ లో నేడు వెలసిన 70% విగ్రహాల చరిత్ర అంతా ఒక బూజు లాంటిదని , వారికి జయంతిలు, వర్ధంతిలు ఎందుకు చేస్తారో , ఎందుకు చేయాలో మెజార్టీ ఆంధ్రులకు తెలియదని , కార్పొరేట్ రాజకీయ పార్టి లన్ని అంతర్గత కూటమిగా ఏర్పడి రాష్ట్ర భవిష్యత్ ను దోచుకుంటు శాసన కర్తలుగా ఉనికి చాటుకుంటున్నారు . ప్రస్తుతం వారి సొంత ప్రభలు చాటుకుంటున్న కార్పొరేట్ రాజకీయ శక్తుల అధినేత లంత కార్పొరేట్ శక్తులకు కూలి వాళ్ళే నని , వారి సూచనల మేరకు మాత్రమే పాలన జరగాలి. లేకుంటే రోజుల్లో పదవికి, ఆ ప్రభుత్వానికి కాలం చెల్లటం మనం చూస్తున్న నిజాలు కావా అని ఆయన గుర్తు చేసారు.
మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పేదరికం రోజు రోజుకు పెరిగిపోతుందని , మోడీ కార్పొరేట్ శక్తులకు ఒక ఏజెంట్ మాదిరి పని చేస్తున్నారని , లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుండి పన్నుల రూపంలో మోడీ సర్కార్ వసూలు చేస్తుందని , 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం వివిధ రాష్ట్రాలకు 1 లక్షా 73 వేలు కోట్లు నిధుల విడుదల చేయగా అందులో దక్షిణాది రాష్ట్రాలకు 27 వేల 336 కోట్లు విడుదల చేసి తీవ్ర ద్రోహం చేసారు . ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే 31 వేల కోట్లు కేటాయించి మోడీ సర్కార్ పక్షపాతం చూపారు . ఆంధ్రప్రదేశ్ కు 7.2 కోట్లు , తెలంగాణాకు 3,635 కోట్లు మాత్రమే కేటాయించి తెలుగు రాష్ట్రాలపై విషం కక్కారు . దేశ వ్యాప్తంగా కేంద్రానికి ఎక్కువ శాతం పన్నులు చెల్లించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలను మోడీ సర్కార్ మరువటం దురదృష్టం అని , 15 వ ఆర్ధిక సంఘం నిధుల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం జరిగినా చంద్రబాబు కూటమి మౌనం వహించటం కూటమి అసమర్ధతను చాటుకుంటుంది . తెలంగాణాలో కాంగ్రెస్ సర్కార్ వున్నప్పటికి ఆ రాష్ట్రానికి అతి తక్కువ నిధులు కేటాయించినా రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహారించటం వెనుక ఓటుకు నోటు కేసే ననే అనుమానాలు నివృత్తి అవుతున్నాయి. నిధులు కేటాయింపుల్లో చంద్రబాబు కూటమి వ్యవహార శైలిపై ఆంధ్రుల్లో తిరుగుబాటు తథ్యం అని ఆయన హెచ్చిరించారు .
ఆంధ్రప్రదేశ్ మోయలేని అప్పులతో బక్క చిక్కి పోతుంటుంటే కొన్ని కార్పొరేట్ మీడియా శక్తులు కార్పొరేట్ రాజకీయ పార్టి లకు భజన చేస్తు ఆంధ్రప్రదేశ్ కు వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని , నిధుల వరదలు అంటు కార్పొరేట్ మీడియా కధనాలతో జర్నలిజానికి గ్లోబల్ కంపు కొట్టిస్తున్నారని , కార్పొరేట్ మీడియాకు చిత్తశుద్ధి వుంటే ప్రత్యేక హోదా , విభజన హామీల కోసం, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన రెవిన్యూ వాటా కోసం , పునర్వీభజన చట్టంలో జరిగిన అవక తవకల పై వార్త కధనాలు వ్రాయాలని, కార్పొరేట్ వార్త కధనాలతో నిజమైన జర్నలిజానికి పాతర వేస్తున్నారని , ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం జారి చేసినవన్ని అప్పులు గానే ఇచ్చారని , మన రాష్ట్రానికి హక్కుగా చెందాల్సిన ఏ ఒక్క గ్రాంటు నేటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవని , అప్పులను నిధులు అంటు కార్పొరేట్ వార్త కధనాలు అచ్చు వేస్తు రాష్ట్ర భవిష్యత్ కు మోకాలు అడ్డు పెట్టడం ప్రజా ద్రోహంగా బావించాలని , కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రుల తరుపున అడగాల్సిన చంద్రబాబు కూటమి నిశ్శబ్దం వెనుక కారణాలు ఏమిటో తెలియాల్సిన అవసరం వుందని , ప్రత్యేక హోదా , విభజన చట్టం హక్కులను , ఇతర అభివృద్ధి , సంక్షేమం కోసం చంద్రబాబు కూటమి సర్కార్ మోడీని ప్రశ్నించి సాధించాలని ఆయన డిమాండ్ చేసారు .
ఎంతో విలువైన సంపద గల ఆంధ్ర రాష్ట్రంపై కొన్ని విదేశీ , స్వదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నారని , ఈ శక్తులకు మోడీ సర్కార్ సాగిల పడి ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తుందని , వివిధ కుంబకోణాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ మోడీకి బాంచన్ అంటు ఆంధ్రులను బక్ష గాళ్ళ మాదిరి తయారు చేస్తున్నారని , భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రకృతి సంపద ఒక్క ఆంధ్ర రాష్ట్రం లోనే ఉండటం ఆంధ్రుల అదృష్టం అయినప్పటికి పాలకుల మోసాలకు శాపంగా బలైతుందని , మన రాష్ట్ర సంపద తోను , మన తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి చెల్లెస్తున్న పన్నుల తోను మొత్తం 60% భారతదేశం యొక్క ఆర్ధిక బడ్జెట్ నడుస్తుందని , అంత గొప్ప సిరి సంపదలు గల ఆంధ్రప్రదేశ్ కు మోడీ సర్కార్ అన్యాయం చేస్తుందని , అత్యంత ప్రకృతి శక్తి గల ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేట్ శక్తుల ఆగడాలకు కళ్లెం వేయాల్సిన సమయం ఆసన్నమైనదని , ఆంద్రులు అందరు కార్పొరేట్ రాజకీయ పార్టిల మత్తు నుండి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యంగా నేటి కలుషిత రాజకీయాలను ప్రక్షాళణ చేసే దిశగా ఉద్యమ రాజకీయ పార్టి లన్ని ఏకం కావాలని , విద్యార్థులు, యువత ఈ మహోన్నతమైన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .
ఈ సమావేశంలో అర్పిసి సీనియర్ సెక్యూలర్స్ సర్వశ్రీ సిమ్మా దుర్గారావు , డి వి రమణ మూర్తి , ఎమ్ డి హుస్సేన్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్ , దుడ్డే త్రినాద్ , మాసా అప్పాయమ్మ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , లంక వీర వెంకట సత్యనారాయణ , సుంకర వెంకట భాస్కర రంగారావు , అడపా దేవుడు , చల్లా శివ దుర్గారావు , చాల్లా సాంబశివరావు, చల్లా అఖిల్, చల్లా వంశీ తదితరులు పాల్గొనియున్నారు ..