అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
అయోధ్య రాముడికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా, టీటీడీ చరిత్రలోనే వెంకటేశ్వర స్వామి తరఫున తొలిసారిగా రాములవారికి ఆయన పట్టువస్త్రాలు తీసుకువచ్చారు.
శనివారం రాత్రి అయోధ్యలో సరయూ నది ఒడ్డున జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ నాయుడు దంపతులు.. ఈ రోజు (ఆదివారం) టీటీడీ తరఫున అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు