హిమాయత్‌నగర్ టీటీడీ ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసిన మనోహర్‌రెడ్డి
మనోరంజని తెలుగు టైమ్స్ హైదరాబాద్ డిసెంబర్ 30
హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో గల టీటీడీ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పవిత్ర సందర్భంలో మాజీ రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి స్వామివారి వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు.
ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కృపతో ప్రజలందరికీ సుఖశాంతులు, సమృద్ధి కలగాలని ప్రార్థించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడగా, టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాలు సజావుగా నిర్వహించారు. భక్తులు “ఓం నమో వెంకటేశాయ” నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని భక్తిమయంగా మార్చారు.